honey preet: మీడియాకు చిక్కిన హనీప్రీత్.. ఆమె ఇంటర్వ్యూ విశేషాలు ఇవే!
- మా నాన్న (డేరా బాబా) అమాయకుడు
- అల్లర్ల వెనుక నా హస్తం లేదు
- తీర్పు సమయంలో షాక్ లో ఉన్నాం. కుట్రలెలా పన్నుతాం?
- నన్ను దేశద్రోహి అనడం చాలా దారుణం
డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ... ఆమె ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే, మీడియా కంటికి మాత్రం ఆమె చిక్కింది. ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన ఆవేదనను వెళ్లగక్కింది. ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన విషయాలు ఇవే..
- మీడియాలో నాపై ఎన్నో కథనాలు వస్తున్నాయి. అవన్నీ పచ్చి అబద్ధాలు.
- నన్ను దేశ ద్రోహిగా అభివర్ణించడం చాలా దారుణం.
- నా మానసిక పరిస్థితి దారుణంగా ఉంది.
- గుర్మీత్ కు శిక్ష పడ్డ తర్వాత జరిగిన అల్లర్ల వెనుక నా హస్తం ఉందని నిందలు వేస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ల దగ్గర ఏమైనా ఆధారం ఉందా?
- జరిగిందంతా మీడియా చూసింది. నేనేం నేరం చేశానో మీరే చెప్పండి.
- నేను ఎవరికీ ఎలాంటి సూచనలు చేయలేదు. అలాంటప్పుడు అల్లర్ల వెనుక నా హస్తం ఉందని ఎలా చెబుతారు?
- సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తామనే మేము కోర్టుకు వెళ్లాం. అయితే, తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది. కోర్టు దగ్గర తీవ్ర విధ్వంసం జరిగింది.
- తీర్పు నేపథ్యంలో మా మైండ్ పనిచేయడం కూడా మానేసింది. అలాంటి పరిస్థితుల్లో అల్లర్లకు మేమెలా కుట్రలు పన్నుతాం?
- నా తండ్రి (డేరా బాబా) అమాయకుడు. ఆయనపై లేనిపోని నిందలు వేస్తున్నారు.
- ఒక కూతురు ఏం చేస్తుందో... నేను కూడా అదే చేశా.