sbi new chirman: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కొత్త ఛైర్మన్
- కొత్త ఛైర్మన్గా రజనీశ్ కుమార్
- పదవిలో మూడేళ్లు కొనసాగనున్న కొత్త ఛైర్మన్
- ప్రస్తుతం ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న రజనీశ్
- మరో రెండు రోజుల్లో ముగియనున్న అరుంధతీ భట్టాచార్య పదవీకాలం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి కొత్త ఛైర్మన్గా రజనీశ్ కుమార్ పేరును ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. మూడేళ్లు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్య పదవీకాలం ఈ వారాంతంతో ముగుస్తుండడంతో రజనీశ్ను కొత్త ఛైర్మన్గా ఎన్నుకున్నారు. అక్టోబర్ 7, 2013లో ఎస్బీఐ తొలి మహిళ చైర్మన్గా భట్టాచార్య ఎంపికైన విషయం తెలిసిందే. నిజానికి ఆమె పదవీకాలం గతేడాదే ముగిసింది.
అయితే ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీన నేపథ్యంలో ఆమె పదవిని ఏడాది పాటు పొడిగించారు. కాగా, రజనీశ్ ప్రస్తుతం ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన 1980లో ఎస్బీఐలో ఉద్యోగిగా చేరి ఆ సంస్థలో పలు విభాగాల్లో పనిచేశారు.