bcci: మూడు నెలలకు కోటి 20 లక్షలు.. ఇది రవిశాస్త్రి అందుకున్న జీతం!
- మూడు నెలల కాలానికి వేతనం చెల్లింపు
- వెబ్సైట్లో పేర్కొన్న బీసీసీఐ
- ప్రధాన కోచ్గా తొలి జీతం అందుకున్న రవిశాస్త్రి
టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి సేవలకు గాను మొదటి మూడు నెలల వేతనాన్ని బీసీసీఐ చెల్లించింది. జులై 18 నుంచి అక్టోబర్ 18 వరకు పనిచేసినందుకు రూ. 1,20,87,187 చెల్లించినట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ ఏడాది జులైలో అనిల్ కుంబ్లే స్థానంలో రవిశాస్త్రి ప్రధాన కోచ్గా నియమితులైన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ నెలకు గాను ఖర్చుల జాబితాను బీసీసీఐ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అలాగే మహేంద్ర సింగ్ ధోనికి భారత్ వెలుపల ఆడిన మ్యాచుల రెవెన్యూ రూ. 57,88,373 చెల్లించినట్లు పేర్కొంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ క్రికెట్ అసోసియేషన్లకు, మీడియా ఖర్చులను కూడా బీసీసీఐ వెల్లడించింది.