shashi: 8 నెలల తరువాత జైలు నుంచి బయటకు వచ్చిన శశికళ
- మేనల్లుడు దినకరన్ తో చెన్నైకు పయనం
- ఈ రోజు సాయంత్రం చెన్నై గ్లోబల్ ఆసుపత్రిలో భర్త వద్దకు చిన్నమ్మ
- తోడికోడలు ఇళవరసి ఇంట్లోనే ఈ ఐదు రోజులు
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న శశికళకు ఐదు రోజుల పెరోల్ లభించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె బెంగళూరు జైలు నుంచి విడుదలైంది. పరప్పన అగ్రహార జైలు నుంచి ఆమెను ఆమె మేనల్లుడు దినకరన్ చెన్నై తీసుకెళుతున్నారు. ఈ రోజు సాయంత్రం చెన్నై గ్లోబల్ ఆసుపత్రిలో శశికళ తన భర్తను పరామర్శించనుంది. కాగా, ఆమె సుమారు 8 నెలల నుంచి జైలులో ఉంటోన్న సంగతి తెలిసిందే. శశికళ తన తోడికోడలు ఇళవరసి ఇంట్లోనే ఈ ఐదు రోజులు ఉండాల్సి ఉంటుంది. ఆమె భర్త నటరాజన్ మూత్రపిండాలు, కాలేయం వ్యాధితో చికిత్స పొందుతున్న సంగతి విదితమే.