nani: కార్తీక్కి, జెస్సీకి శుభంకార్డు పడిపోయింది!: చైతూ, సమంతల పెళ్లిపై నాని ట్వీట్
- రాత్రి 11.52 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి
- రేపు క్రైస్తవ పద్ధతి ప్రకారం పెళ్లి
- శుభాకాంక్షల వెల్లువ
గోవాలో నటులు అక్కినేని నాగచైతన్య, సమంత వివాహ వేడుక జరుగుతోంది. శుక్రవారం రాత్రి 11.52 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం సమంత, చైతూ ఒక్కటి కానున్నారు. రేపు మధ్యాహ్నం క్రైస్తవ పద్ధతి ప్రకారం పెళ్లిని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఈ జంటకు ట్విట్టర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కార్తీక్కి, జెస్సీకి శుభంకార్డు పడిపోయిందని సమంత, చైతూ పెళ్లిపై నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశాడు. వారిద్దరికి శుభాకాంక్షలు చెబుతున్నట్లు పేర్కొన్నాడు. 'ఏమాయ చేశావే' సినిమాలో నాగచైతన్య, సమంతల పాత్రల పేర్లు కార్తీక్, జెస్సీ అన్న విషయం తెలిసిందే.
సినీనటులు సుశాంత్, మెహ్రీన్ పిర్జాదా, రాజుగారి గది-2 సినిమా బృందంతో పాటు పలువురు సమంత, నాగచైతన్యలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇక అభిమానుల నుంచి లెక్కలేనన్ని శుభాకాంక్షలు వస్తున్నాయి.