gold: దీపావళికి బంగారం కొనుగోళ్లు పెరగనున్నాయా?
- బంగారం కొనుగోళ్లకు పాన్ కార్డు నిబంధనను తొలగించిన కేంద్రం
- 50,000 రూపాయలకు పైగా బంగారం కొంటే పాన్ ఇవ్వక్కర్లేదు
- హర్షం వ్యక్తం చేస్తున్న బంగారం వర్తకులు
- దీపావళికి కొనుగోళ్లు పెరుగుతాయన్న ఆశ
దుస్తులపై జీఎస్టీ రద్దు దిశగా ఆలోచిస్తున్న కేంద్రం తాజాగా మహిళలకు శుభవార్త వినిపించింది. నోట్ల రద్దు సందర్భంగా యాభైవేల రూపాయల విలువగల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా పాన్ కార్డును సమర్పించాలని గతంలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీని వల్ల బంగారం అమ్మకాలు గణీనీయంగా తగ్గిపోయాయి. బంగారం షాపులకు వెళ్లాలంటే మహిళలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.
దీంతో బంగారం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్ కు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. దీనిపై బంగారం వర్తకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ దీపావళికి బంగారం అమ్మకాలు జోరందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.