shankar: 'భారతీయుడు' సీక్వెల్ బడ్జెట్ 200 కోట్లు!

  •  '2.0' పనుల్లో బిజీగా శంకర్
  •  ఆ తరువాత 'భారతీయుడు' సీక్వెల్ పై దృష్టి
  •  తెలుగు .. తమిళ భాషల్లో నిర్మాణం
  • స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం 

భారీతనం శంకర్ సినిమాల ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. బలమైన కథా కథనాలతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాలను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. 'రోబో' సీక్వెల్ గా '2.0' సినిమా పనుల్లో వున్న శంకర్, ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగానే, 'భారతీయుడు' సీక్వెల్ పై దృష్టి పెట్టనున్నారు.

 గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన 'భారతీయుడు' ఒక సంచలనం. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ ను తెరకెక్కించడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్న దిల్ రాజు, 200 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి స్క్రిప్ట్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమాను, ఇతర భాషల్లోను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  

  • Loading...

More Telugu News