godra linching: 'గోద్రా రైలు దహనం' దోషులలో 11 మంది మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన హైకోర్టు!

  • కీలక తీర్పును ఇచ్చిన గుజరాత్ హైకోర్టు
  • ఫిబ్రవరి 27, 2002న ఘటన
  • సబర్మతీ రైలు కోచ్ ని దగ్ధం చేసిన దోషులు 
  • 59 మంది మృతి, ఆపై మత కలహాలు
  • దోషుల అపీలు తరువాత కింది కోర్టు తీర్పును సవరించిన హైకోర్టు

2002లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సబర్మతీ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టిన ఘటనలో గుజరాత్ హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవరించింది. ఈ కేసులో 11 మందికి సెషన్స్ కోర్టు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నట్టు తెలిపింది. ఫిబ్రవరి 27, 2002న సబర్మతీ ఎక్స్ ప్రెస్ లోని ఎస్-6 కోచ్ ని గోద్రా జంక్షన్ రైల్వే స్టేషన్ సమీపంలో తగులబెట్టగా, 59 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
 
ఈ ఘటనలో మొత్తం 94 మంది నిందితులైన ముస్లింలపై కేసులు నమోదు చేసిన ప్రత్యేక దర్యాఫ్తు బృందం వారిపై చార్జ్ షీట్ లను దాఖలు చేసింది. కేసు విచారణ సుదీర్ఘకాలం సాగగా, నిందితుల్లో 63 మందిపై సాక్ష్యాలు లేని కారణంగా ఆరోపణలను కొట్టేసిన సిట్ కోర్టు, మిగిలిన 31 మందిని నేరస్తులుగా నిర్థారించి, వారిలో 11 మందికి మరణశిక్ష, మిగిలినవారికి జీవిత ఖైదును విధించింది. మరణశిక్ష పడిన వారు అపీలు చేసుకోగా, విచారించిన హైకోర్టు, వారి శిక్షను కూడా జీవిత ఖైదుగా మారుస్తూ కొద్దిసేపటిక్రితం తీర్పిచ్చింది.

  • Loading...

More Telugu News