fire crackers: నవంబర్ 1 వరకూ న్యూఢిల్లీలో టపాకాయల అమ్మకాలపై నిషేధం... సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

  • ఈ దఫా కాలుష్యం తేడాను గమనిస్తాం
  • దేశ రాజధానిపై పొగచూరనివ్వబోము
  • సమర్థించిన సెంట్రల్ పొల్యూషన్ బాడీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 

దేశ రాజధాని న్యూఢిల్లీ సహా, చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో నవంబర్ 1 వరకూ టపాకాయల విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రతి సంవత్సరమూ దీపావళి నాడు కాల్చే టపాకాయల కారణంగా వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో, ఎయిర్ క్వాలిటీలో వచ్చే తేడాను సరిగ్గా అంచనా వేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది.

గత సంవత్సరం కూడా దీపావళి మరుసాడు దట్టమైన పొగ, దుమ్ము, ధూళితో నగరం నిండిపోయిందని ధర్మాసనం గుర్తు చేసింది. కాగా, గత సంవత్సరం నవంబర్ లో ముగ్గురు చిన్నారులు కోర్టుకు లేఖ రాస్తూ, క్రాకర్స్ అమ్మకాలను నిషేధించాలని కోరిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం పటాసుల అమ్మకాలపై నిషేధం విధించి, ఆపై వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజల విన్నపం మేరకు దాన్ని సవరించింది. తిరిగి ఈ దీపావళికి టపాకాయల విక్రయాలు సాగరాదని తాజాగా ఆదేశించింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సెంట్రల్ పొల్యూషన్ బాడీ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు సమర్థించాయి.  

  • Loading...

More Telugu News