Hyderabad: గత రాత్రి హైదరాబాదులో భారీ వర్షం... ధరణీ నగర్ ను ముంచెత్తిన నురగ!

  • నిన్న సాయంత్రం నుంచి హైదరాబాదులో వర్షం 
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • నిండుకుండను తలపిస్తున్న రామాంతపూర్ పెద్దచెరువు

హైదరాబాదును నిన్న సాయంత్రం 5 గంటల నుంచి వర్షం ముంచెత్తింది. ప్రధానంగా రామాంతపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్ షుక్ నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షం కురిసింది. వరదనీటి ధాటికి కాలనీలు, రోడ్లు నీటమునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తుండడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామాంతపూర్ పెద్దచెరువు నిండుకుండలా మారిపోయింది. దీంతో కట్టతెగుతుందా? అన్న భయాందోళనలు స్థానికుల్లో నెలకొన్నాయి.

వరదనీరు భారీగా చేరుతుండడంతో ధరణీ నగర్ లో పరిశ్రమలు వదిలే రసాయన వ్యర్థాలతో కలిసిన నీరు నురగగా రూపాంతరం చెందింది. దీంతో కాలనీ మొత్తాన్ని నురగ కమ్మేసింది. ఇది వెదజల్లుతున్న దుర్గంధంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు హైటెక్ సిటీకి దారితీసే రోడ్లు నీట మునగడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, నేడు కూడా హైదరాబాదును వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News