eggs: కోడిగుడ్లతో కేన్సర్‌కి చెక్... సాధ్యమంటున్న జపాన్ శాస్త్రవేత్తలు
- కోడి జన్యువుల్లో మార్పు చేస్తే సరి
- హెపటైటిస్ వ్యాధి నివారణకు కూడా
- ప్రయోగాత్మకంగా విజయం సాధించిన శాస్త్రవేత్తలు
కేన్సర్ వ్యాధి చికిత్సకు కోడిగుడ్లను కూడా ఉపయోగించవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. గుడ్లు పెట్టే కోళ్ల జన్యువుల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా కేన్సర్‌కి చెక్ పెట్టే గుడ్లను ఉత్పత్తి చేయవచ్చని వారు చెబుతున్నారు. అదే గుడ్లను హెపటైటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి వ్యాధుల చికిత్సకు కూడా ఉపయోగించవచ్చని జపాన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్త యోమిరి షింబం తెలిపారు.
కేన్సర్ చికిత్సలో ఉపయోగించే ఇంటర్ ఫెరాన్ బీటా రసాయనాన్ని ఈ కోడిగుడ్లలో అభివృద్ధి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రసాయనం ఖరీదు చాలా ఎక్కువ. అదే కోడిగుడ్ల ద్వారా దీన్ని ఉత్పత్తి చేయగలిగితే అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలియజేశారు. ఇలాంటి గుడ్లు పెట్టడానికి కోళ్ల జన్యువును మార్పు చేయడంలో వారు ప్రయోగాత్మకంగా విజయం సాధించినట్లు యోమిరి చెప్పారు.