tripura: పటాసులపై నిషేధం తర్వాత ఇక హిందువుల అంత్యక్రియలపై నిషేధం ఉంటుందేమో!: త్రిపుర గవర్నర్ సెటైర్
- ఢిల్లీలో దీపావళికి పటాసులు అమ్మకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు
- స్పందించిన త్రిపుర గవర్నర్ తథాగథరాయ్
- వివాదాస్పద వ్యాఖ్యలు
దేశ రాజధాని ఢిల్లీలో దీపావళికి పటాసులు కాల్చకూడదని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వచ్చే నెల 1 వరకు ఢిల్లీలో పటాసుల అమ్మకంపై నిషేధం ఉంటుందని పేర్కొంది. అయితే, దీనిపై త్రిపుర గవర్నర్ తథాగథరాయ్ స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పటాసులపై నిషేధం తర్వాత ఇక హిందువుల అంత్యక్రియలపై నిషేధం ఉంటుందేమోనని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అవార్డులు వెనక్కిస్తున్న వారు, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించే వారు.. ఇక హిందువుల అంత్యక్రియలపై నిషేధం విధించాలని కోర్టును ఆశ్రయిస్తారేమోనని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఏడాదికి ఒక్కరోజు చేసుకునే దీపావళితోనే కాలుష్య సమస్య వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు.