child marriage: మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే.. కఠిన శిక్షార్హమే!: తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

  • వెంటనే చట్టం చేయండి
  • కేంద్రానికి సుప్రీం సూచన
  • బాల్య వివాహాలను అడ్డుకోవాలంటే తప్పదు
  • అభిప్రాయపడ్డ జస్టిస్ మదన్ బీ లోకూర్

బంధు మిత్రుల నడుమ వైభవంగా వివాహం జరిగిన తరువాత, భార్య మైనర్ అయినప్పటికీ, వారి మధ్య శృంగారాన్ని పెద్ద నేరంగా పరిగణించలేమని, భారత వివాహ విలువ, దాంపత్య బంధాలన్న అడ్డుగోడలు శిక్షకు అడ్డంకులని గతంలో వ్యాఖ్యానించిన న్యాయస్థానాలు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నాయి. 18 ఏళ్లు నిండని మైనర్, భార్య అయినా, ఆమెతో శృంగారం కఠిన శిక్షార్హమేనని, నేరానికి పాల్పడిన వ్యక్తికి సెక్షన్ 375 ప్రకారం మినహాయింపులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దేశంలో జరుగుతున్న బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ విషయంలో కేంద్రం తక్షణం స్పందించాలని కోరింది.

కాగా, జీవిత భాగస్వామి వయసు 18 సంవత్సరాలు దాటిన తరువాత, బలవంతంగా శృంగారానికి పాల్పడటాన్ని వైవాహిక అత్యాచారంగా ప్రకటించే అంశంలో మాత్రం అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. దేశంలో 2.3 కోట్ల బాల్య వివాహాలు ఉండగా, వాటిని రద్దు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని బెంచ్, 18 ఏళ్లు నిండని భార్యపై జరిపే శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించి శిక్షించే అంశంపై చట్టం చేయాలని కేంద్రానికి సూచించింది. కాగా, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, ప్రస్తుతం 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో 46 శాతం మంది వివాహాలు 18 ఏళ్లలోపే జరిగిపోయాయి.

  • Loading...

More Telugu News