kerala: సోలార్ స్కామ్ కేసులో కేరళ మాజీ ముఖ్యమంత్రిపై విచారణ
- మరో ఇద్దరు మాజీ మంత్రులపై కూడా
- ఆదేశించిన కేరళ ప్రభుత్వం
- రూ. 70 లక్షలు విలువైన సోలార్ స్కామ్లో ఒమెన్ చాందీ హస్తం
కేరళ మాజీ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీపై విచారణ చేపట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. 2013లో జరిగిన సోలార్ స్కామ్లో భాగంగా చాందీతో పాటు ఆయన హయాంలో పనిచేసిన తిరువాంచుర్ రాధాకృష్ణన్, ఆర్యదన్ మహ్మద్, కాంగ్రెస్ నేతలు తంపనూర్ రవి, బెన్నీ బెహనన్లపై కూడా ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచారణకు ఆదేశించారు. రూ. 70 లక్షలు విలువైన ఈ సోలార్ స్కామ్లో ఒమెన్ చాందీ హస్తం ఉందని సోలార్ స్కామ్ కమిషన్ నివేదిక వెల్లడించింది.