trumph: 'ఆ పదం నేనే కనిపెట్టా'నంటున్న ట్రంప్!
- ఫేక్ పదాన్ని నేనే కనిపెట్టాను
- దీనిని ప్రజలు కూడా చాలాకాలంగా వాడుతున్నారు
- నేను గమనించనే లేదు
- ఈ పదం 1800 సంవత్సరం నుంచి ఉందంటూ ఆధారాలు
మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పదాన్ని కనిపెట్టానని అన్నారు. అధ్యక్ష పదవికి నామినేట్ అయిన నాటి నుంచి మీడియాను ‘ఫేక్ మీడియా’ అంటూ ట్రంప్ పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, ఈ ఫేక్ అన్న పదాన్ని తానే కనిపెట్టానని అన్నారు. చాలాకాలంగా ప్రజలు దీనిని వాడుతున్నారని ఆయన చెప్పారు. దానిని తాను గమనించలేదని ఆయన చెప్పారు.
ఫేక్ మీడియా కారణంగా దేశం గొప్పతనం దెబ్బతింటోందని ఆయన చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. ఆ పదం 1800 సంవత్సరం నుంచి వాడుకలో ఉందని, అది ట్రంప్ కనిపెట్టింది కాదంటూ పలు ఆధారాలు చూపుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ రచయిత్రి జేకే రౌలింగ్ కూడా ఉండడం విశేషం.