team india: రేపటి టీ20కి సర్వం సిద్ధం.. 1800 మంది పోలీసులతో బందోబస్తు: మహేష్ భగవత్
- ఉప్పల్ మ్యాచ్ కు ఏర్పాట్లు పూర్తి
- ప్రేక్షకులకు పలు సూచనలు చేసిన రాచకొండ సీపీ
- 55 సీసీ కెమెరాలతో నిఘా
భారత్-ఆస్ట్రేలియా సిరీస్ ను నిర్ణయించే చివరి టీ20కి హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. రేపు జరగనున్న ఈ మ్యాచ్ కు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ, సాయంత్రం 4 గంటల నుంచి స్టేడియం గేట్స్ ఓపెన్ చేస్తామని తెలిపారు. దాదాపు 9 వేలకు పైగా వాహనాలు స్టేడియం వద్దకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కారులో వచ్చేవారు రామంతపూర్ వైపు ఉండే ఎల్జీ గౌడౌన్ వద్ద పార్క్ చేసి... గేట్ 1, 2 ద్వారా లోపలకు వెళ్లాలని సూచించారు.
మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చేవారు కెమెరాలు, ల్యాప్ టాప్, అగ్గిపెట్టెలు, బైనాక్యులర్స్, బ్యాటరీ, సిగరెట్స్, లైటర్స్, బ్యానర్స్, హెల్మెట్, వాటర్ బాటిల్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, రైటింగ్ పెన్స్, పెర్ఫ్యూమ్, పవర్ బ్యాంక్, తినుబండారాలు తీసుకురావద్దని మహేష్ భగవత్ తెలిపారు. సెక్యూరిటీ కోసం 1800 మంది లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు, ఇతర భద్రతా బలగాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. స్టేడియంతో పాటు చుట్టుపక్కల 56 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు.