india: తడిస్తే తడవండి... గొడుగులను మాత్రం అనుమతించం: హైదరాబాద్ పోలీసుల వైఖరిపై విమర్శలు

  • నేడు ఉప్పల్ లో టీ-20 మ్యాచ్
  • పోటీ పడనున్న భారత్, ఆస్ట్రేలియా
  • ఆటకు అడ్డంకిగా వరుణుడు
  • గొడుగులపై పోలీసుల ఆంక్షలు

నేడు హైదరాబాదు, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో కీలకమైన మూడో టీ-20 పోరు జరగనుండగా, ఈ మ్యాచ్ కి వరుణుడు అడ్డంకిగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కి టికెట్లన్నీ అమ్ముడుపోగా, ఇప్పటికే స్టేడియం వద్ద సందడి మొదలైంది.

ఒకవేళ వర్షం పడితే, కాస్తంత ఆసరాగా ఉంటుందన్న ఉద్దేశంతో గొడుగులను వెంట తీసుకుని క్రీడాభిమానులు వస్తుండగా, వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. మైదానంలోకి గొడుగులను అనుమతించేది లేదని తేల్చి చెబుతున్నారు. నిబంధనల ప్రకారం, గొడుగులను అనుమతించేందుకు వీల్లేదని స్పష్టం చేస్తుండటంతో పోలీసుల వైఖరిపై విమర్శలు వస్తున్నాయి.

కాగా, ఉప్పల్ మైదానంలో 90 శాతం గ్రౌండ్ ఎటువంటి పైకప్పూ లేకుండానే ఉంటుంది. అంటే స్టేడియం నిండి మధ్యలో వర్షం వస్తే, సుమారు 32 వేల మంది వర్షంలో తడవాల్సిన పరిస్థితి. ఒకవేళ వర్షం వల్ల బయటకు వచ్చేస్తే కనుక, తగ్గిన తరువాత తిరిగి మళ్లీ మ్యాచ్ ప్రారంభమైతే కనుక చూడలేని పరిస్థితి వుంది. ఎందుకంటే, టీ-20 మ్యాచ్ ల టికెట్ పై ఒకసారి స్టేడియంలోకి వెళ్లేందుకు మాత్రమే వీలుంటుంది కాబట్టి. ఈ క్రమంలో గొడుగులేమైనా మారణాయుధాలా? అని అభిమానులు ప్రశ్నిస్తుండగా, అనుమతి లేని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ మైదానంలోకి తీసుకు వెళ్లరాదని పోలీసులు అంటున్నారు.

  • Loading...

More Telugu News