padmavathi: 'పద్మావతి' నగల కోసం 400 కేజీల బంగారం వాడారు...వీడియో చూడండి!
- పద్మావతి నగలను రూపొందించిన తనిష్క్ సంస్థ
- 400 కేజీల బంగారంతో నగలు
- 200 మంది బంగారు నగల నిపుణులతో 600 రోజుల శ్రమ
- సినిమాకు భారీతనం తీసుకొచ్చిన ఆభరణాలు
బాలీవుడ్ భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలాభన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న 'పద్మావతి' సినిమా గురించిన ఆసక్తికర అంశాలను చిత్రయూనిట్ వీడియో రూపంలో విడుదల చేసింది. 'పద్మావతి' సినిమా ట్రైలర్లో ఈ సినిమాలోని నగలను చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, 13వ శతాబ్దం నాటి చరిత్రను ఆ నగలు ప్రతిబింబించాయి. ఈ ఆభరణాలను సంజయ్ లీలా భన్సాలీ 'తనిష్క్' సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వీటి తయారీలో సుమారు 200 బంగారు ఆభరణాల తయారీదారులు పాలుపంచుకున్నారు.
400 కేజీల బంగారాన్ని నగలుగా మలిచేందుకు వారంతా 600 రోజుల పాటు శ్రమించారని తనిష్క్, 'పద్మావతి' యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో 'పద్మావతి' పాత్రధారి దీపికా పదుకునే రాణిగా భారీ నగలను ధరించగా, రాజు 'మహారావల్ రతన్ సింగ్' పాత్రలో షాహిద్ కపూర్, 'అల్లావుద్దీన్ ఖిల్జీ' పాత్రలో రణ్ వీర్ సింగ్ కూడా రాజరికం ఒలకబోసేందుకు భారీ నగలను ధరించారు.
ఈ సందర్భంగా వారు ధరించిన నగల తయారీకి సంబంధించిన ఏవీని చిత్రయూనిట్ తో కలిసి తనిష్క్ విడుదల చేసింది. దానిని మీరు కూడా చూడండి. కాగా, డిసెంబర్1న ‘పద్మావతి’ థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది.