kancha ilaiah: కంచ ఐలయ్య పుస్తకాన్ని నిషేధించాలన్న పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
- 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకాన్ని రచించిన కంచ ఐలయ్య
- ఈ పుస్తకాన్ని నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
- పుస్తకం నిషేధించడమంటే రచయిత భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్టేనని అభిప్రాయపడ్డ సర్వోన్నత న్యాయస్థానం
- పిటిషన్ ను కోట్టేసిన సుప్రీంకోర్టు
ప్రొ. కంచ ఐలయ్యకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. తెలుగు రాష్ట్రాలలో పెను వివాదానికి కారణమైన ఆయన రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కంచ ఐలయ్య రాసిన ఆ పుస్తకం ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందని పేర్కొంటూ వీరాంజనేయులు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.
దీనిని విచారించిన న్యాయస్థానం... పుస్తకాన్ని నిషేధించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్టేనని పేర్కొంటూ, ఆ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. పుస్తక రచయితకు చట్టపరిధిలో భావాలను వ్యక్తపరిచే అవకాశముందని, గతంలోనూ పుస్తకాల శీర్షికలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సుప్రీంకోర్టు పిటిషనర్ కు గుర్తు చేసింది.