us: ఉత్తర కొరియా తొలి బాంబు వేసేంత వరకూ వేచి చూస్తాం: అమెరికా
- దౌత్య మార్గాలపైనే ఆలోచిస్తున్నాం
- ట్రంప్ అభిప్రాయం కూడా ఇదే
- ఆపై మాత్రం మరో ఆలోచన లేదు
- యూఎస్ విదేశాంగ మంత్రి టిల్లర్సన్
ఉత్తర కొరియా నుంచి తొలి బాంబు పడేంత వరకూ తాము చర్చలు, దౌత్య పరమైన మార్గాల ద్వారానే ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ను అదుపులో పెట్టే ప్రయత్నాలు సాగిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ వ్యాఖ్యానించారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే విధమైన అభిప్రాయంతో ఉన్నారని, ఆయన స్వయంగా ఈ విషయాన్ని చెప్పారని అన్నారు.
దౌత్య పరంగా అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు సాగించాలని ట్రంప్ వెల్లడించారని, తొలి బాంబు వచ్చేంత వరకూ చర్చలకు అవకాశాలపై పరిశీలిస్తూనే ఉండాలని తెలిపారని అన్నారు. ఆ తరువాత మాత్రం యుద్ధం మినహా మరో ఆలోచన ఉండబోదని తెలిపారు.