vijay: విజయ్ 'మెర్సెల్' రిలీజ్ డౌటే అంటున్నారు .. కారణాలు ఇవే!
- విజయ్ తాజా చిత్రంగా రూపొందిన 'మెర్సెల్'
- భారీ బడ్జెట్ .. భారీ తారాగణం
- పావురాలను ఉపయోగించారంటూ అభ్యంతరం
- కథ నాదేనంటూ హైకోర్టులో పిటిషన్
విజయ్ తాజా చిత్రం 'మెర్సెల్' రిలీజ్ కి వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇంతకుముందు ఈ టైటిల్ నాదేనంటూ ఒక వ్యక్తి కేసు వేయడంతో, ఈ సినిమా ప్రమోషన్స్ ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ వివాదం నుంచి బయటపడిన ఈ సినిమా, ఇక 'దీపావళి' పండుగకి ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని అనుకున్నారు. కానీ మరో రూపంలో మళ్లీ ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఈ సినిమాలో పావురాలను ఉపయోగించడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. జంతు సంరక్షణ సంస్థల నుంచి నిరభ్యంతర సర్టిఫికేట్ ను తెచ్చుకోవాలని సూచించింది. ఇక ఇదిలా వుంటే ఈ కథ తనదేనంటూ నిర్మాతలపై ఒక వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దాంతో ఈ సినిమా దీపావళికి విడుదలవుతుందా .. లేదా? అనే డౌట్ అభిమానులను కలవరపెడుతోంది. తెలుగులోనూ ఈ సినిమా 'అదిరింది' పేరుతో రానున్న సంగతి తెలిసిందే.