bjp: తూచ్.. నా ఉద్దేశం అది కాదు.. ‘తాజ్‌మహల్‌’పై వెనక్కి తగ్గిన యూపీ బీజేపీ ఎమ్మెల్యే

  • దేశ సంస్కృతికి తాజ్‌మహల్ మాయని మచ్చన్న మంత్రి
  • విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గి వివరణ
  • తాను తప్పుబట్టింది మొఘల్ చక్రవర్తులను తప్ప తాజ్‌మహల్‌ను కాదన్న ఎమ్మెల్యే

తాజ్‌మహల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వెనక్కి తగ్గారు. తన ఉద్దేశం అది కాదని వివరణ ఇచ్చారు. తాను వ్యతిరేకించింది మొఘల్ పాలకులనే తప్ప తాజ్‌మహల్‌ను కాదని పేర్కొంటూ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సోమవారం సంగీత్ సోమ్ మాట్లాడుతూ తాజ్‌మహల్ దేశ సంస్కృతికి మాయని మచ్చని, అది దేశద్రోహులు నిర్మించిన కట్టడమంటూ వివాదానికి తెరతీశారు.

తాజ్‌మహల్‌ను నిర్మించిన షాజహాన్ తన తండ్రినే నిర్బంధించి, హిందువులను ఏరిపారేయాలని అనుకున్నాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తుల చరిత్ర మనకు అవసరం లేదని పేర్కొన్నారు. బాబర్, అక్బర్, ఔరంగజేబులు దేశద్రోహులని అన్నారు.  ఆయన వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో సాయంత్రానికే మాట మార్చారు. తన ఉద్దేశం అది కాదంటూ వివరణ ఇచ్చారు. తాజమహల్ అందమైన కట్టడమని పేర్కొన్న ఆయన చరిత్రలో దానిని చిత్రీకరించిన విధానాన్నే తాను తప్పుబట్టినట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News