samanta: చెన్నైలో ఘనంగా జరిగిన చైతూ, శామ్ రిసెప్షన్!

  • చెన్నైలో ఘనంగా జరిగిన నాగచైతన్య, సమంతల వివాహ రిసెప్షన్
  • రిసెప్షన్ నిర్వహించిన నాగచైతన్య పెద మేనమామ దగ్గుబాటి సురేష్ బాబు
  • వేడుకకు హాజరైన దుగ్గుబాటి కుటుంబం, బంధువులు, సన్నిహితులు

నాగ చైతన్య-సమంతల వివాహం హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం వారి వివాహ రిసెప్షన్ కూడా రెండు సార్లు జరుగుతుందని వార్తలు వచ్చాయి. అందులో భాగంగా తొలి రిసెప్షన్ చెన్నైలో ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి ప్రైవేటు కార్యక్రమంలా జరిగిన ఈ రిసెప్షన్ ను దగ్గుబాటి కుటుంబం ఏర్పాటు చేసింది.

 నాగచైతన్య తల్లి లక్ష్మి తరపున దగ్గుబాటి సురేష్ బాబు దీనిని నిర్వహించారు. ఈ వేడుకకు దగ్గుబాటి కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితులు హాజరైనట్టు సమాచారం. రిసెప్షన్ కూడా పెళ్లి వేడుకలా ఆనందంగా జరిగిందని తెలుస్తోంది. ఈ రిసెప్షన్ జరిగిపోవడంతో ఇక నాగార్జున ఏర్పాటు చేయనున్న రిసెప్షన్ హైదరాబాదులో జరగనుంది. దీనికి ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. 

  • Loading...

More Telugu News