hebba patel: సినిమా ప్లాప్ అయితే ఆ రోజంతా ఏడ్చేస్తాను : హెబ్బా పటేల్
- 'ఎక్కడికిపోతావు చిన్నవాడా'తో హెబ్బాకు హిట్
- ఆ తరువాత చేసిన రెండు సినిమాలు ప్లాప్
- 'ఏంజెల్' హిట్ ఇస్తుందనే నమ్మకం
- రిలీజ్ కోసం వెయిటింగ్
'ఎక్కడికి పోతావు చిన్నవాడా' హిట్ తరువాత తాను చేసిన రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో, మళ్లీ ఓ మంచి హిట్ కోసం హెబ్బా పటేల్ ఎదురుచూస్తోంది. అలాంటి హిట్ ను అందిస్తుందనే నమ్మకంతోనే ఆమె 'ఏంజెల్' సినిమా చేసింది. ఈ సినిమా రిలీజ్ కోసం అందరికంటే ఎక్కువగా ఆమెనే ఎదురుచూస్తోంది.
ఈ నేపథ్యంలో ఆమె ఐ డ్రీమ్స్ తో మాట్లాడింది. ఎవరైనా సరే హిట్ అవుతుందనే ఉద్దేశంతోనే ఏ సినిమా అయినా చేస్తారు. ఒకవేళ చేసిన సినిమా ప్లాప్ అయితే ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్న హెబ్బాకు ఎదురైంది. తాను చేసిన సినిమా ఏదైనా ప్లాప్ అయితే ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఏడుస్తూనే ఉంటానని హెబ్బా చెప్పింది. రెండవ రోజుకి కొంత తేరుకుంటాననీ, ఎప్పుడూ సక్సెస్ లు .. పరాజయాలే రావుకదా అని మనసుకు సర్ది చెప్పుకుంటానని అంది. ఆ తరువాత నెక్స్ట్ మూవీపై దృష్టి పెడతానని చెప్పుకొచ్చింది.