yovaraj singh: క్రికెటర్ యువరాజ్ సింగ్ పై గృహహింస కేసు!
- సోదరుడి భార్య ఆకాంక్షపై వేధింపులు
- బిడ్డను కనాలని వేధిస్తున్న తల్లి, భర్త
- మద్దతిస్తున్న యువరాజ్ సింగ్
- కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రముఖ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పై గృహహింస కేసు నమోదైంది. ఆయన సోదరుడు జరోవర్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ కేసు పెట్టగా, అందులో యువరాజ్ పేరును కూడా చేర్చారు. ఈ విషయాన్ని ఆకాంక్ష తరఫు న్యాయవాది స్వాతి సింగ్ మాలిక్ వెల్లడిస్తూ, బిడ్డను కనాలని తన క్లయింటు ఆకాంక్షపై జరోవర్, ఆయన తల్లి షబ్నం సింగ్ లు ఒత్తిడి తెస్తున్నారని, ఈ విషయంలో యువీ తన కుటుంబీకులకు మద్దతు తెలుపుతుండటంతోనే ఆయన పేరును చేర్చినట్టు తెలిపారు.
కేవలం శారీరక హింస కింద మాత్రమే గృహహింస చట్టాలను నమోదు చేయరని, మానసిక, ఆర్థిక ఒత్తిడి తెచ్చినా ఈ సెక్షన్లను చేర్చవచ్చని అన్నారు. ఇటీవల తమ డబ్బుతో ఆకాంక్ష కొనుగోలు చేసుకున్న నగలను తిరిగి ఇప్పించాలని షబ్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.