ranbir kapoor: రణ్‌బీర్‌తో సిగరెట్ తాగుతున్న ఫొటోలపై మొదటిసారిగా నోరు మెదిపిన మహీరా ఖాన్
- అబ్బాయి, అమ్మాయి కలిసి తిరగడం చాలా కామన్
- వ్యక్తిగత విషయమని వ్యాఖ్య
- మీడియా గురించి గొప్ప గుణపాఠం నేర్చుకున్నాను
ఇటీవల పొట్టి దుస్తులు ధరించి బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌తో కలిసి పాకిస్థానీ నటి మహీరా ఖాన్ సిగరెట్ తాగుతూ ఉన్న ఫొటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోల్లో ఆమెను చూసిన చాలా మంది నెటిజన్లు మహీరాను తీవ్రంగా విమర్శించారు. పొట్టి వస్త్రాలు ధరించడంపైన, సిగరెట్ తాగడంపైన, మహిళ వ్యవహరించాల్సిన విధానాల గురించి హితబోధ చేశారు. ఈ వివాదంపై మొదటిసారిగా మహీరా స్పందించింది. తన చిత్రం `వెర్నా` ట్రైలర్ లాంచ్ వేడుకలో ఆమె ఈ వివాదం గురించి మాట్లాడింది.
`అది నా వ్యక్తిగత జీవితం. ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి తిరగడం చాలా సాధారణం. అయినప్పటికీ ఈ సంఘటన ద్వారా చాలా మంచి గుణపాఠం నేర్చుకున్నా! మీడియా ప్రతి చోట ఉంటుందని, వాళ్ల కళ్లుగప్పి తిరగడం కష్టమని నాకు అర్థమైంది` అని మహీరా ఖాన్ అంది.