renu desai: నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది: రేణూ దేశాయ్ భావోద్వేగం
- ‘నీతోనే డ్యాన్స్ షో’లో జడ్జిగా పాల్గొంటోన్న రేణూ దేశాయ్
- ప్రొమో విడుదల చేసిన స్టార్ మా టీవీ
- ఓ జంట చేసిన డ్యాన్ చూసి భావోద్వేగానికి గురైన రేణూ దేశాయ్
- కన్నీరు పెట్టుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
నటి, ప్రొడ్యూసర్ రేణూ దేశాయ్ స్టార్ మా టీవీలో ప్రసారం అవుతోన్న ‘నీతోనే డ్యాన్స్ షో’లో జడ్జిగా పాల్గొంటోన్న విషయం తెలిసిందే. ఈ డ్యాన్స్‌షోలో ఆమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వచ్చే శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించిన ప్రొమోను 'స్టార్ మా' తమ ట్విట్టర్ ఖాతాలో ఉంచింది.
ఇందులో ఓ జంట చేసిన డ్యాన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించిన రేణూ దేశాయ్.. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అందరితో కన్నీరు పెట్టిస్తున్నాయి. ‘నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది.. ఇప్పుడు మరోసారి నేను ప్రేమతో ప్రేమలో పడ్డాను.. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటానో అప్పుడు మిమ్మల్ని తప్పకుండా పిలుస్తా’ అని ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఆ జంటకు చెప్పింది. మీరూ చూడండి...