america: అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కిమ్ జాంగ్ ఉన్!

  • అమెరికా ఊహించని సమయంలో ఊహకందని విధంగా దాడులు చేస్తాం
  • నిత్యం రెచ్చగొడుతోందంటూ అసహనం
  • తీవ్ర ఉద్రిక్తతల నడుమ జరుగుతున్న నేవీ డ్రిల్స్

నిత్యం ఏదో ఒక చర్యతో రెచ్చగొడుతున్న అమెరికాకు ఊహించని షాక్ ఇస్తామని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరించారు. కొరియన్ ద్వీపకల్పంలో నిత్యం ఏదో ఒక డ్రిల్‌ తో రెచ్చగొడుతున్న అమెరికా, ఉత్తరకొరియా పట్ల ఉన్మాదంగా వ్యవహరిస్తోందని కిమ్ జాంగ్ ఉన్ మండిపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో నేవీ డ్రిల్స్ నిర్వహించడం తమను రెచ్చగొట్టేందుకు అమెరికా పన్నిన కుట్ర అని ఆయన పేర్కొన్నారు.

నేవీ డ్రిల్స్ ముగిసిన వెంటనే దక్షిణకొరియాతో మరో డ్రిల్‌ ను అమెరికా నిర్వహించనుందన్న వార్తల నేపథ్యంలో, అమెరికా ఇలాంటి చర్యలను కొనసాగిస్తే...ఆ దేశం ఊహించని సమయంలో ఊహకందని విధంగా దాడులు చేస్తామని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు. కాగా, ప్రతి రెండేళ్లకోసారి దక్షిణకొరియా, అమెరికాలు సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న విన్యాసాలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరుగుతుండడంతో ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. 

  • Loading...

More Telugu News