venkatesh: వచ్చేనెలలోనే తేజతో సెట్స్ పైకి వెంకీ!
- తేజతో సినిమా చేయడానికి ఆసక్తిని చూపిన వెంకటేశ్
- యాక్షన్ డ్రామాతో కూడిన నేపథ్యం
- కాలేజ్ ప్రొఫెసర్ గా కనిపించనున్న వెంకటేశ్
'నేనే రాజు నేనే మంత్రి' సినిమా చూసినప్పుడే తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ఉందనే అభిప్రాయాన్ని వెంకటేశ్ వ్యక్తం చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, తేజతో తప్పకుండా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దాంతో యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఒక కథను సిద్ధం చేసిన తేజ, ఆ కథను వెంకటేశ్ కి వినిపించాడు.
ఇంతవరకూ తాను చేయని కథ .. పాత్ర కావడంతో వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో తేజ వున్నాడు. నవంబర్ 2వ వారంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. సురేష్ బాబు . అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో, కాలేజ్ ప్రొఫెసర్ గా వెంకటేశ్ కనిపించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.