ap: ఏపీకి తప్పిన ముప్పు... తీరం దాటేసిన తుపాను
- పారాదీప్ వద్ద తీరం దాటిన తుపాను
- ఏపీలో తేలికపాటి వర్షాలు
- నిష్క్రమించిన నైరుతి రుతుపవనాలు
- పెరిగిన చలిగాలులు
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఒడిశాలోని పారాదీప్ వద్ద తీరాన్ని దాటింది. తుపాను తొలుత కోస్తా తీరాన్ని తాకుతుందని అంచనాలు వేసినా, ఆపై దిశమార్చుకున్న వాయుగుండం ఒడిశావైపు కదిలింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ వాయుగుండం ఏపీవైపు రాకపోవడంతో ముప్పు తప్పినట్లయింది. దీని ప్రభావంతో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు దాదాపుగా నిష్క్రమించడంతో చలి గాలులు పెరిగాయి. నిన్న పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదైంది. ఈ సీజన్ లో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి.