solicitor general: సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ రాజీనామా

  • వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా
  • న్యాయ శాఖకు ఈ ఉదయం రాజీనామా లేఖ
  • తదుపరి సొలిసిటర్ జనరల్ గా తుషార్ మెహతా నియమితులయ్యే అవకాశం

సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు ఈ ఉదయం తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నానని... పని ఒత్తిడిలో తన కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేక పోతున్నానని రాజీనామా లేఖలో రంజిత్ పేర్కొన్నారు. రంజిత్ రాజీనామాతో అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా ఉన్న తుషార్ మెహతాకు పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. రంజిత్ కుమార్ 2014 జూన్ లో సొలిసిటర్ జనరల్ గా నియమితులయ్యారు. అంతకు ముందు గుజరాత్ ప్రభుత్వ తరఫు లాయర్ గా ఉన్నారు. సుప్రీంకోర్టులో పలు కేసులకు అమికస్ క్యూరీగా వ్యవహరించారు. అక్రమాస్తుల కేసులో జయలలిత తరఫున బెంగళూరు కోర్టులో వాదించారు. 

  • Loading...

More Telugu News