BSE: మార్కెట్ కు 'మోదీ బూస్ట్'... దూసుకెళుతున్న సెన్సెక్స్!

  • భారీ లాభాల్లో పీఎస్యూ బ్యాంకులు
  • ఏకంగా 22 శాతం పెరిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • ఐసీఐసీఐ బ్యాంకు కూడా
  • నష్టాల్లో కోటక్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్

ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధనాన్ని అందిస్తామని, మొత్తం రూ. 2.11 లక్షల కోట్లు సిద్ధం చేస్తున్నామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం, రహదారులకు పెద్ద పీట వేస్తూ 'భరత్ మాల' ప్రాజెక్టుకు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పడం, జీఎస్టీ ఫలాలు ఒక్కొక్కటిగా అందుతున్నాయని జైట్లీ చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచాయి.

ఈ ఉదయం స్టాక్ మార్కెట్ సెషన్ ప్రారంభమైన తరువాత బీఎస్ఈ క్రితం ముగింపుతో పోలిస్తే 300 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ సూచిక సైతం 10,250 పాయింట్ల రికార్డును తాకింది. బ్యాంకుల రీకాపిటలైజేషన్ కు భారీ నిధులు కేటాయిస్తుండటంతో పీఎస్యూ బ్యాంకెక్స్ భారీగా లాభపడింది.

ఈ ఉదయం 11.15 గంటల సమయంలో సెన్సెక్స్ సూచిక 276 పాయింట్లు పెరిగి 32,884 పాయింట్లకు, నిఫ్టీ 53 పాయింట్ల వృద్ధితో 10,260 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. ఎస్బీఐ అత్యధికంగా 22.13 శాతం లాభపడింది. ఐసీఐసీఐ 9.38 శాతం పెరిగింది. ఎల్&టీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు మంచి లాభాలను నమోదు చేశాయి. ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ తదితర బ్యాంకులు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News