jayanth c paranjee: 'టక్కరి దొంగ' భారీ ప్లాప్ .. అప్పులు తీర్చడానికి నాలుగేళ్లు పట్టింది : దర్శకుడు జయంత్ సి.పరాన్జీ

  • దర్శకుడిగా భారీ హిట్స్ ఇచ్చిన జయంత్ సి.పరాన్జీ 
  • ఎలాంటి మెంటల్ టెన్షన్స్ పెట్టుకోను 
  • ఎప్పుడూ హ్యాపీగా వుంటాను 
  • భారీగా నష్టం వచ్చినా అలాగే వున్నాను

దర్శకుడు జయంత్ సి.పరాన్జీ పేరు వినగానే 'ప్రేమించుకుందాం రా' .. 'బావగారు బాగున్నారా' .. 'ప్రేమంటే ఇదేరా' సినిమాలు గుర్తుకు వస్తాయి. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. "ప్రేమించుకుందాం రా' సినిమా సమయంలో ఎలా వున్నారో ఇప్పుడూ అలాగే కనిపిస్తున్నారు .. ఇదెలా సాధ్యం? అనే ప్రశ్నకి ఆయన నవ్వుతూ .. "ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకపోవడమే" అని చెప్పారు.

" ఏ విషయంలోను మెంటల్ టెన్షన్ తీసుకోను .. సినిమా ప్లాప్ అయినా అది అంతగా నాపై ప్రభావం చూపించదు" అని జయంత్ అన్నారు. " 'టక్కరి దొంగ' సినిమా భారీ నష్టాన్ని తీసుకొచ్చింది .. అప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గానే వున్నాను. ఏంటి .. ఇలా నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నారు? అని చాలామంది అడిగారు. కానీ ఏం చేస్తాం .. అలా జరిగిపోయింది. ఆ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోకుండా 'ఈశ్వర్' షూటింగుకి వెళ్లిపోయాను. 'టక్కరి దొంగ' ప్లాప్ కావడంతో ఆ అప్పులు తీర్చడానికి  నాలుగేళ్లు పట్టింది" అని చెప్పుకొచ్చారు.     

  • Loading...

More Telugu News