jayanth c paranjee: 'తీన్ మార్' సినిమా ఆడదని నాకు ముందే తెలుసు!: దర్శకుడు జయంత్ సి.పరాన్జీ
- 'తీన్ మార్' సినిమా ఒక చేదు అనుభవం
- ఉన్నది వున్నట్టుగా తీయాల్సి వచ్చింది
- మార్పులు చేయడం కుదరలేదు
పవన్ కల్యాణ్ కెరియర్లో కనిపించే ప్లాప్ సినిమాల జాబితాలో 'తీన్ మార్' సినిమా కూడా కనిపిస్తుంది. బండ్ల గణేశ్ నిర్మాణంలో రూపొందిన ఈ రీమేక్ 2011లో విడుదలైంది. "ఇక నా జీవితంలో ఎప్పుడూ రీమేక్ లు చేయను" అని జయంత్ సి.పరాన్జీ అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకు కారణమేంటనే విషయాన్ని ఆయన తాజాగా ఐ డ్రీమ్స్ తో చెప్పారు.
" 'తీన్ మార్' సినిమా నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది. ఆ సినిమాను ఉన్నది ఉన్నట్టుగా చేయవలసి వచ్చింది. అంతకుముందు చేసిన 'లక్ష్మీ నరసింహా' .. ' శంకర్ దాదా' సినిమాలు రీమేక్ లే అయినా, తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్ ప్రకారం కొన్ని మార్పులు చేశాను. 'తీన్ మార్' కి ఎలాంటి మార్పులూ చేయలేదు. వున్నది వున్నట్టుగా తీయవలసి వచ్చింది. అప్పుడే నాకు తెలుసు, ఆ సినిమా ఆడదని. అయినా ఏదో ట్రై చేద్దాం అన్నట్టుగా చేయాల్సివచ్చింది .. అంతే" అని చెప్పుకొచ్చారు.