botsa satyanarayana: ఈడీ కేసులో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ!
- బెయిల్ కోసం లంచం కేసులో బొత్స, షబ్బీర్
- ఎంబీఎస్ జ్యువెలర్స్ యజమాని సుఖేష్ గుప్తా వ్యవహారం
- ఈడీ ఛార్జ్ షీట్ లో బొత్స, షబ్బీర్
సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న నిందితుల తరపున సీబీఐ డైరెక్టర్లకు లంచాలు తీసుకెళ్లారంటూ వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈయనతో పాటు తెలంగాణ శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీపై కూడా ఛార్జ్ షీట్ నమోదు చేశారు.
సీబీఐ మాజీ డైరెక్టర్లు ఏపీ సింగ్, రంజిత్ సిన్హాకు హవాలా మార్గంలో నిధులు అందించారనే కేసులో ప్రధాన నిందితుడు మోయిన్ ఖురేషీతో పాటు బొత్స, షబ్బీర్ ల పేర్లను కూడా చేర్చారు. ఎంబీఎస్ జ్యువెలర్స్ యజమాని సుఖేష్ గుప్తాకు బెయిల్ ఇప్పించేందుకు సతీష్ సనా ద్వారా ఖురేషీకి రూ. 2 కోట్లు చెల్లించినట్టు ఛార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది. ఈ వ్యవహారం కోసం సతీష్ తో కలసి బొత్స, షబ్బీర్ లు ఢిల్లీకి వెళ్లారని తెలిపింది.