encounter: 144 కేసుల్లో నిందితుడు భీమ్ సింగ్ను ఎన్కౌంటర్ చేసిన కర్నూలు పోలీసులు!
- రాజస్థాన్ జాలోర్ జిల్లాలో ఏపీ పోలీసుల భారీ ఆపరేషన్
- కర్నూలు జిల్లాలో దోపిడీకి పాల్పడి ఐదున్నర కోట్లు దోచుకెళ్లిన భీమ్ సింగ్ ముఠా
- రాజస్థాన్లో ఎదురు కాల్పులు
రాజస్థాన్ జాలోర్ జిల్లాలో ఏపీ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి, 144 కేసుల్లో నిందితుడయిన భీమ్ సింగ్ను హతమార్చారు. గతంలో కర్నూలు జిల్లాలో దోపిడీకి పాల్పడ్డ భీమ్ సింగ్ ముఠా ఐదున్నర కోట్ల రూపాయల డబ్బును దోచుకెళ్లింది. భీమ్ సింగ్ ముఠా ఇతర రాష్ట్రాల్లోనూ దోపిడీలకు పాల్పడింది. కర్నూలులో దోపిడీకి పాల్పడ్డ భీమ్ సింగ్ ముఠాపై కేసులు నమోదు చేసుకున్న కర్నూలు పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి అతని కోసం గాలించారు.
నిందితుడు రాజస్థాన్లో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు భీమ్ సింగ్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. కారులో వెళుతోన్న భీమ్ సింగ్ను గుర్తించిన పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులపై భీమ్ సింగ్ కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసుల ఎదురు కాల్పుల్లో భీమ్ సింగ్ హతమయ్యాడు.