indiramma: ఇందిరా గాంధీ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా ఏపీ కాంగ్రెస్ తీర్మానాలు

  • వ‌చ్చేనెల 19న‌ ఇందిరా గాంధీ శ‌త జ‌యంతి
  • విజ‌య‌వాడ‌లో  రాష్ట్ర స్థాయి విద్యార్థి, యువ‌జ‌న స‌ద‌స్సు
  • ప‌లు తీర్మానాలు చేసిన నేత‌లు

వ‌చ్చేనెల 19న‌ ఇందిరా గాంధీ శ‌త జ‌యంతి ఉన్న నేప‌థ్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తోంది. ఈ రోజు విజ‌య‌వాడ‌లో రాష్ట్ర స్థాయి విద్యార్థి, యువ‌జ‌న స‌ద‌స్సు జ‌రిగింది. ఇందిర‌మ్మ న‌డిచిన బాటే త‌మ భ‌విష్య‌త్ బాట అని ఏపీ కాంగ్రెస్ నేత‌లు ప్ర‌తిజ్ఞ చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు విద్యార్థులకు, యువ‌జ‌నుల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. నిరుద్యోగుల‌కు ఇస్తామ‌న్న నిరుద్యోగ భృతిని ఇవ్వాల‌ని కోరారు. విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతోన్న ప్రైవేటు కాలేజీల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు.

  • Loading...

More Telugu News