nick gooden: పది బంతులేసి 8 వికెట్లు తీశాడు... క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు!

  • పది బంతుల్లో ఎనిమిది వికెట్లు, ఓ రన్నౌట్
  • ఐదు వరుస బంతుల్లో ఐదు వికెట్లు
  • నిక్ గూడెన్ అరుదైన రికార్డు

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియాలో లోకల్ లీగ్ లు ఆడుతున్న కుర్రాళ్లు ఇటీవలి కాలంలో గుర్తుండిపోయే రికార్డులు నమోదు చేస్తున్నారు. ఇటీవలే వెస్టర్ అగస్టా బీ గ్రేడ్ కు చెందిన ఆటగాడు, 40 సిక్సులతో 307 పరుగులు కొట్టి ట్రిపుల్ సెంచరీ సాధించగా, ఇప్పుడో విక్టోరియన్ థర్డ్ గ్రేడ్ క్రికెటర్ మరెవరూ సాధించలేకపోయిన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.

యాల్లౌర్న్ నార్త్ తరపున ఆడుతున్న నిక్ గూడెన్, పది బంతులేసి ఎనిమిది వికెట్లను దొరకబుచ్చుకోవడంతో పాటు ఓ రన్నౌట్ తో కలిపి ట్రిపుల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇందులో ఐదు వరుస బాల్స్ లో ఐదు వికెట్లు తీయడం గమనార్హం. ఇదెలా జరిగిందో తనకూ అర్థం కాలేదని, కానీ ఓ మరపురాని అనుభూతి మాత్రం కలిగిందని మ్యాచ్ అనంతరం 'వీకెండ్ సన్ రైజ్' పత్రికతో గూడెన్ వ్యాఖ్యానించాడు. సాధ్యమైనంత త్వరగా ప్రత్యర్థిని అవుట్ చేయాలన్న వ్యూహం మాత్రమే మనసులో ఉందని, అది ఇంత త్వరగా సాధ్యమవుతుందని అనుకోలేదని చెప్పాడు.

  • Loading...

More Telugu News