vegetables: అమాంతం పెరిగిపోయిన కూరగాయల ధరలు!
- సామాన్యుల అవస్థలు
- ధరలు పెరిగిపోయాయని వాపోతున్న వినియోగదారులు
- కిలో టమోటా 50, వంకాయ 80, బీరకాయలు కేజీ 60 రూపాయలు
- నవంబరు చివరి వారం వరకు తగ్గే అవకాశం లేదని సమాచారం
ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. భారీగా పెరిగిపోయిన కూరగాయల ధరలతో సామాన్యులు అవస్థలు పడుతున్నారు. విజయనగరం రైతు బజార్లో మీడియాతో మాట్లాడిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని కూరగాయల ధరలు కిలోకి 40 రూపాయలకు పైగానే ఉన్నాయని చెప్పారు. కిలో టమోటా 50, వంకాయ 80, బెండకాయ 40 రూపాయలుగా ఉన్నాయని చెప్పారు.
వంద రూపాయలు పట్టుకొస్తే రెండు రకాల కూరగాయలు కూడా రావట్లేదని అన్నారు. బీరకాయలు కేజీ 60 రూపాయలుగా ఉన్నాయని చెప్పారు. దిగుబడులు తగ్గడంతో ధరలు పెరిగిపోయాయని, ఈ వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు పంటలు పాడైపోయాయని రైతులు అంటున్నారు. నవంబరు చివరి వారం వరకు ధరలు ఇదే విధంగా ఉండొచ్చని చెప్పారు.