landmines: ల్యాండ్మైన్లను లెక్కచేయని మహిళ.. 'ఆర్మర్ సూట్' ధరించిన యువతి.. వీడియో చూడండి
- ఆర్మర్ సూట్ పరీక్షించడానికి పేలుళ్ల మధ్యన నడక
- చాలా అద్భుత అనుభవమని వ్యాఖ్య
- బాంబులను, బుల్లెట్లను తట్టుకునే సూట్
రష్యాకు చెందిన ఓ ఆయుధాల కంపెనీ మిలటరీ అవసరాల కోసం బుల్లెట్లను, బాంబు పేలుళ్లను తట్టుకోగల ఆర్మర్ సూట్‌ను తయారుచేసింది. ఆ సూట్ పనితీరును పరీక్షించడం కోసం ఒక మహిళకు ఆ సూట్ వేసి బాంబులు పెట్టిన ప్రదేశంలో నడిపించారు. పేలుతున్న ల్యాండ్మైన్లను ఏ మాత్రం లెక్కచేయకుండా ఆర్మర్ సూట్ వేసుకుని హుందాగా ఆ మహిళ నడిచి వచ్చిన వీడియో యూట్యూబ్‌లో ఉంది. ఈ విన్యాసం గురించి రష్యా టుడే రాసిన కథనం ప్రకారం... బాంబుల మధ్య నడవడం, వాటి పేలుళ్లను తట్టుకోవడం చాలా అద్భుత అనుభవమని ఆ మహిళ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే బాంబులు పేలినపుడు వెలువడే చిన్న చిన్న రాతి గుళ్లను తట్టుకునే శక్తి ఈ ఆర్మర్ సూట్‌కి ఉందని రష్యన్ ఆయుధాల సంస్థ తెలిపింది.