women: మహిళలకు రక్షణ విషయంలో గోవాకు మొదటిస్థానం... నివేదికలో వెల్లడి
- నివేదిక విడుదల చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ
- ఆరోగ్యం విషయంలో కేరళ మొదటి స్థానం
- చివరి స్థానంలో బిహార్
మహిళలకు రక్షణ కల్పించే విషయంలో గోవా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. `ప్లాన్ ఇండియా` పేరుతో మహిళా శిశు సంక్షేమ శాఖ విడుదల చేసిన నివేదికలో జెండర్ వల్నెరబిలిటీ ఇండెక్స్ (జీవీఐ) లో 0.656 స్కోర్ సాధించింది. దేశవ్యాప్తంగా జీవీఐ చూస్తే 0.5314గా ఉంది. అంతేకాకుండా విద్యారంగంలో 5వ స్థానం, ఆరోగ్యంలో 6వ స్థానం, పేదరికంలో 8వ స్థానంలో గోవా నిలిచింది.
ఈ జాబితాలో కేరళ, మిజోరాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో బాలికలకు పెద్దగా రక్షణ లేదని నివేదిక వెల్లడించింది. విద్యా, ఆరోగ్యం, పేదరికం రంగాల్లో మహిళలకు రక్షణ గురించి ఈ నివేదిక రూపొందించారు. ఆరోగ్యంలో కేరళ మొదటి స్థానం సంపాదించింది. బిహార్ అతి తక్కువ రక్షణ కల్పిస్తూ చివరి స్థానంలో నిలిచింది.