Mamata Banerjee: శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో మమతా బెనర్జీ కీలక భేటీ
- భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉంటోన్న శివసేన పార్టీ
- కొంత కాలంగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తోన్న శివసేన
- ముంబయిలో పర్యటిస్తోన్న మమతా బెనర్జీ
- ప్రస్తుత రాజకీయ అంశాలపై ఠాక్రేతో చర్చ
భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉంటోన్న శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో ముంబయిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆమె కీలక చర్చలు జరుపుతున్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆమె ప్రస్తుతం ముంబయిలో పలువురితో సమావేశం అవుతున్నారు.
ఈ క్రమంలో ఆమె ఉద్దవ్ ఠాక్రే వద్దకు వెళ్లి రాజకీయాలపై చర్చిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలనపై శివసేన తీవ్ర విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా శివసేన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.