Karnataka swamy: 82 ఏళ్ల వయసులో 9వ బిడ్డ.. పండంటి మగబిడ్డకు తండ్రయిన పీఠాధిపతి!
- ఉత్తర కర్ణాటకలోని కలబురగి (గుల్బర్గా)లో శరణ బసవేశ్వర సంస్థాన పీఠం
- ఆ పీఠాధిపతి శరణబసప్ప.. ఆయనకు రూ.100 కోట్ల ఆస్తులు
- వారసుడి కోసం ఎదురుచూపులు
- ఇప్పటికి ఫలించిన ఆశ
ఉత్తర కర్ణాటకలోని కలబురగి (గుల్బర్గా) లోని శరణ బసవేశ్వర సంస్థాన పీఠాధిపతి శరణబసప్ప 82 ఏళ్ల వయసులో మరో బిడ్డకు తండ్రయ్యాడు. ఇన్నేళ్లు మగబిడ్డ కోసం ఎదురు చూసిన సదరు పీఠాధిపతి కల తాజాగా పండింది. ఆయన మొదటి భార్యకు వరసగా ఐదుగురు కూతుళ్లు జన్మించడంతో, ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ ఆయనకు మగబిడ్డ భాగ్యం కలగలేదు. రెండో భార్య ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఆయన మొత్తం ఎనిమిది మంది ఆడపిల్లలకు తండ్రయ్యాడు.
ఈ క్రమంలో నిన్న ఆయన రెండో భార్య (42) ముంబయ్ లోని ఆసుపత్రిలో ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తనకు పుట్టిన బిడ్డ మగబిడ్డని తెలియడంతో సదదు పీఠాధిపతి ఎగిరి గంతులేశారు. ఈ వయసులో ఆయన తండ్రి కావడంతో కర్ణాటకలో అంతా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. శరణబసప్పకు దాదాపు రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన మఠం అనేక విద్యాసంస్థలను కూడా నడిపిస్తోంది. ఆ మఠానికి సంరక్షకుడిగా ఉండేందుకు ఆయనకు వారసుడిగా ఈ వయసులో మగబిడ్డ జన్మించాడు.