narayana college: బ్లాక్ టూ వైట్, అక్రమ సంబంధాలు, అరాచకాలు... నారాయణ కాలేజీల్లో దందాలపై ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ మధ్య సంభాషణ... వినండి!

  • విద్యార్థుల ఆత్మహత్యలతో వార్తల్లోకి ఎక్కుతున్న నారాయణ
  • ఇప్పుడు ఇద్దరు ఉద్యోగుల సంచలన సంభాషణ
  • కీలక వ్యక్తికి ఉన్న ఆస్తుల వివరాలు చెబుతున్న సరితా అగర్వార్
  • గెస్ట్ హౌస్ లలో అరాచకాలు సాగుతున్నాయని మాట్లాడుకున్న ఉద్యోగులు

తరచూ విద్యార్థుల ఆత్మహత్యలతో వార్తల్లోకి ఎక్కుతున్న నారాయణ కాలేజీల్లో జరుగుతున్న ఘోరాలపై హైదరాబాద్, రామాంతపూర్ బ్రాంచ్ వైస్ ప్రిన్సిపాల్ నవీన్, అదే కాలేజీ ఉద్యోగిని సరితా అగర్వాల్ మధ్య జరిగినట్టు చెబుతున్న సెల్ ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డీమానిటైజేషన్ సమయంలో బ్లాక్ మనీని వైట్ గా ఎలా మార్చుకున్నారన్న విషయంతో పాటు, నారాయణ యాజమాన్యంలో కీలకవ్యక్తిగా ఉన్న ఒకతను చేస్తున్న అరాచకాలు, ఆయనకు ఉన్న ఆస్తుల వివరాలు వినిపిస్తున్నాయి.

 అతనికి ఊరిలో ఈమూ పెంపకం కేంద్రం, సువిశాల ఫామ్ హౌస్, పొలాలు, జూబ్లీహిల్స్ లో బంగళా, హబ్సీగూడలో పెద్ద అపార్ట్ మెంట్స్ భవనం, సర్వే ఆఫ్ ఇండియాలో ఖాళీ స్థలం తదితరాలు ఉన్నట్టు సరిత చెబుతున్నారు. ఆపై టీచర్లతో సంబంధాలపై వీరిద్దరూ మాట్లాడుకున్నారు. నోట్ల రద్దు జరిగినప్పుడు తాను స్వయంగా రూ. 5 లక్షలు మార్చానని, తన వద్ద ఉన్న కరెన్సీ మార్చలేక గిలగిలా కొట్టుకున్నాడని జోకులేసుకున్నారు.

శ్రీలత ఆత్మహత్యకు కారణం ఏంటన్న విషయం కూడా ఫోన్ లో వినిపించింది. ఇక హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురంలో ఉన్న నారాయణ గెస్ట్ హౌస్ అరాచకాలకు అడ్డాగా మారిందని ఫోన్ లో వినిపిస్తోంది. ఈ సంభాషణ ఇప్పుడు పలు సామాజిక మాధ్యమ వెబ్ సైట్లలోకి ఎక్కి వైరల్ అయింది.  వారి సంభాషణను మీరూ వినవచ్చు.

  • Loading...

More Telugu News