singer susheela: నాకేం కాలేదు.. నిక్షేపంగా ఉన్నా: గాయని సుశీల
- నేను ఆరోగ్యంగానే ఉన్నా
- అనారోగ్యంతో ఉన్నానన్న వార్తల్లో నిజం లేదన్న సుశీల
- సుశీల డల్లాస్ లో ఉన్నారన్న బాలు
అలనాటి మధుర సినీ గాయని సుశీలకు సీరియస్ గా ఉందనే పుకార్లు బాగా ప్రచారం అయ్యాయి. ఈ వార్తలపై సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇద్దరూ స్పందించారు. తనకు సీరియస్ గా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయని... వాస్తవానికి తనకు ఎలాంటి అనారోగ్యం లేదని సుశీల తెలిపారు. తాను అమెరికాలో నిక్షేపంగా ఉన్నానని ఓ వీడియో మెసేజ్ ద్వారా తెలిపారు.
ఈ వార్తలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఖండించారు. అమెరికాలోని డల్లాస్ లో ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు.