apcc: ఫాతిమా కళాశాల విద్యార్థులకు న్యాయం చేయాలి: ఏపీసీసీ
- విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించాలి
- విద్యార్థుల సమస్యను రాజకీయకోణంలో చూడవద్దు
- కేంద్ర ఆర్యోగ్య శాఖ మంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకు వెళ్లాలి
- ఈ నెల 8న మేము పెద్దనోట్లు రద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించాలని వారికి న్యాయం చేయాలని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఫాతిమా కళాశాల విద్యార్థుల సమస్యను రాజకీయకోణంలో చూడవద్దని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు వ్యవహారం భాదితులకు అన్యాయం చేసే విధంగా ఉందని చెప్పారు.
కేంద్ర ఆర్యోగ్య శాఖ మంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అన్న ఎన్టీఆర్ పేరిట తెలుగు దేశం ప్రభుత్వం అర్భాటంగా ప్రారంభించిన క్యాంటీన్లను విజయవాడలో ఎప్పుడు ప్రారంభిస్తారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. విజయవాడకు నిత్యం వేల మంది ప్రజలు వస్తుంటారని వారికి అన్న క్యాంటీన్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. తాము ఈ నెల 8న బ్లాక్డే (పెద్దనోట్లు రద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం) నిర్వహిస్తామని, అలాగే ఈ నెల 19న ఇందిరమ్మ శత జయంతి వేడుకను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.