gst: జీఎస్టీ అంటే గ్రేట్ సెల్ఫిష్ ట్యాక్స్... కొత్త అర్థం చెప్పిన మమతా బెనర్జీ
- నోట్ల రద్దు అమానుషం
- నవంబర్ 8న ప్రతిఒక్కరూ నిరసన తెలియజేయాలని విజ్ఞప్తి
- ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌గా నలుపు రంగును పెట్టుకోవాలని వినతి
నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త అర్థాన్ని ఇచ్చారు. జీఎస్టీ అంటే గ్రేట్ సెల్ఫిష్ ట్యాక్స్ (స్వార్థం కోసం విధించిన పన్ను అని అర్థం) అని ఆమె అన్నారు. ఇది ప్రజలను ఇబ్బంది పెట్టి, ఆర్థిక రంగాన్ని అంతం చేసే పన్ను అని ఆమె పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేసిన నోట్ల రద్దు అమానుషమని, అందుకు వ్యతిరేకంగా నవంబర్ 8న ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేయాలని ఆమె కోరారు. ఆ రోజున అందరూ తమ ట్విట్టర్ ఖాతాలో నలుపు రంగును ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'గ్రేట్ సెల్ఫిష్ ట్యాక్స్ ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసమే. ఉద్యోగాలను లాక్కోవడానికే. వ్యాపారాన్ని దెబ్బతీయడానికే. ఆర్థిక రంగాన్ని అంతం చేయడానికే. జీఎస్టీని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది' అని మమతా ట్వీట్ చేశారు. 'నోట్ల రద్దు ఓ విపత్తు. ఆర్థిక రంగాన్ని నాశనం చేసిన ఈ విపత్తుకి వ్యతిరేకంగా నవంబర్ 8న బ్లాక్ డే పాటిస్తూ... మన ట్విట్టర్ డీపీని నలుపు రంగులోకి మారుద్దాం' అని ఆమె మరో ట్వీట్లో పేర్కొన్నారు.