bharathi: కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్త భార‌తి మృతి... రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్!

  • పోలీసులు ఒక్కొక్క‌రిని అడ్డుకుని వాహ‌నంలో వేసి త‌ర‌లిస్తున్నారు
  • అదే స‌మ‌యంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతికి అస్వ‌స్థ‌త‌
  • ఆమె కుటుంబానికి రూ.25 ల‌క్ష‌లు అందిస్తాం
  • భార‌తి మృతి దుర‌దృష్ట‌క‌రం

ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఈ రోజు హైదరాబాద్‌ కలెక్టరేట్ ముందు ఎమ్మార్పీఎస్ చేబట్టిన ఆందోళ‌న‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎమ్మార్పీఎస్‌ కార్యకర్త భార‌తి మృతి చెందారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తోపులాటలో భారతి అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష నాయ‌కులు అసెంబ్లీలో ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓ ప్ర‌క‌ట‌న చేశారు.

పోలీసులు ఒక్కొక్క‌రినీ అడ్డుకుని వాహ‌నంలో వేసి త‌ర‌లిస్తున్నారని, ఆందోళ‌న‌లో అస్వ‌స్థ‌త‌కు గురైన‌ ఆమెను హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి త‌ర‌లించార‌ని చెప్పారు. అయితే,  చికిత్స‌ పొందుతూ ఆమె మృతి చెందారని కేసీఆర్‌ చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై స‌ర్కారు విచార‌ణ జ‌రు‌పుతోందని తెలిపారు. మృతురాలి కుటుంబానికి 25 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్ధిక సాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అసెంబ్లీలో చ‌ర్చ జ‌రుగుతుండ‌గా బ‌య‌ట ఈ ఘ‌ట‌న చోటు చేసుకుందని అన్నారు.

ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌ని కేసీఆర్ చెప్పారు. అప్ప‌ట్లో ఈ వ‌ర్గీక‌ర‌ణ‌ను ప్ర‌తిపాదించిన వారిలో తాను కూడా ఒక‌రినని అన్నారు. అనేకసార్లు వ‌ర్గీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు తెలిపానని తెలిపారు. ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని కూడా క‌లిసి దీనిపై చ‌ర్చించాన‌ని అన్నారు. అఖిల ప‌క్షాన్ని కూడా తీసుకెళ్దామ‌ని అనుకున్నాన‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News