Insomnia: నిద్రపోకున్నా.. మద్యం తాగినా ఒకటే?
- నిద్రలేమిపై కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆసక్తికర పరిశోధనలు
- నిద్రలేమి, మద్యపానం ఒకటేనన్న శాస్త్రవేత్తలు
- మద్యపానం చేసినప్పుడు ఎలాంటి దృశ్య గ్రాహకత ఉంటుందో నిద్రలేమి సమయంలో కూడా అంతే ఉంటుంది
అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఆందోళనకర ఫలితాలు ఇచ్చాయి. శరీరానికి తగినంత నిద్ర అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు. నిద్రలేమి, అతిగా మద్యం సేవించడం రెండూ ఒక్కటేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ రెండూ మెదడుపై ఇంచుమించు సమానమైన చెడు ప్రభావం చూపిస్తాయని వారు వెల్లడించారు.
నిద్రలేమి కారణంగా మెదడు కణాల మధ్య అనుసంధాన శక్తి తగ్గిపోతుందని వారు స్పష్టం చేశారు. దీని కారణంగా జ్ఞాపకశక్తి, దృశ్య గ్రాహకత తగ్గిపోతాయని వారు వెల్లడించారు. దీంతో మానసిక ఆందోళన పెరిగిపోతుందని వారు చెప్పారు. నిద్రలేమితో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మద్యం మత్తులో ఉన్నప్పటిలాగే దృశ్య గ్రాహ్యత తగ్గిపోయి రోడ్డు ప్రమాదాలు జరిగే ముప్పు ఉంటుందని వారు హెచ్చరించారు.