akbaruddin: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తాయి: అక్బరుద్దీన్ ఒవైసీ
- అసెంబ్లీలో మైనార్టీల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ
- టీఆర్ఎస్ సర్కారుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసల వర్షం
- తెలంగాణలో మైనార్టీ గురుకులాలను ప్రారంభించారు
- గత ప్రభుత్వాలు చెల్లించకుండా వదిలేసిన ఉపకార వేతన బకాయిలను చెల్లించారు
టీఆర్ఎస్ సర్కారుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజు అసెంబ్లీలో మైనార్టీల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ... మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారు చేస్తోన్న కృషి అభినందనీయమని చెప్పారు. తెలంగాణలో మైనార్టీ గురుకులాలను ప్రారంభించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు చెల్లించకుండా వదిలేసిన ఉపకార వేతన బకాయిలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు.
అలాగే తెలంగాణలో మైనార్టీ గురుకులాలను ప్రారంభించాలని ఆయన కోరారు. రాష్ట్ర సర్కారు ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ముస్లింలకు కూడా చేయూత అందించాలని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేసి అధికారంలోకి వస్తాయని చెప్పుకొచ్చారు.